Skip to main content

Karthika Deepam 2 Serial Today 7th June episode

Karthika Deepam 2 Serial Today 7th June  episode :-

దీపని తొంగి తొంగి చూస్తూ మెలికలు తిరిగిపోతున్న కార్తీక్.. బాంబ్ పేల్చనున్న పారిజాతం!

Today episode: -




imeage creadits ; hotstar





కార్తీక్‌ శౌర్య, దీపల చుట్టూ తిరగడాన్ని కాంచన నిలదీస్తుంది. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నీ ప్రవర్తన చూస్తుంటే పారిజాతం పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుందని అంటుంది. శ్రీధర్ ఆపడానికి ప్రయత్నిస్తే కార్తీక్ వద్దని పక్కనే కూర్చొని మరో సారి మన మధ్య ఇలాంటి టాపిక్ రాకూడదు అని, తన అత్త కూడా అలా అడగలేదు అని అత్తి నమ్మినప్పుడు అమ్మవి నువ్వు నన్ను నమ్మడం లేదు ఏంటా అని బాధగా ఉందని అంటాడు. కాంచన కార్తీక్, జ్యోత్స్నలకు నిశ్చితార్థం చేసేద్దామని అంటుంది. 

imeage creadits ; hotstar
ఇక అనసూయ సరుకుల కోసం నడుచుకుంటూ వస్తుంది. దీపని చూసి భయపడుతుంది. దీప కంట్లో పడితే నర్శింహ మీద మిగిలిపోయిన కోపం ఉంటే తన తాట తీస్తుందని పరుగులు పెడుతుంది. ఇక కార్తీక్‌ని ఢీ కొడుతుంది. కార్తీక్ ఎందుకు భయంతో పరుగెడుతున్నారు అని అంటే దీపని చూసి అని చెప్తుంది. మిమల్ని చూసి దీప భయపడాలి కానీ మీరు భయపడటం ఏంటి అని కార్తీక్ అడిగితే రాత్రి నుంచి రాత మారిపోయిందని అంటుంది. దీప ఇంటికి వెళ్లి నర్శింహను, అత్తాకోడళ్లను బెదిరించిన సంఘటన చెప్తుంది. నర్శింహ పాపని తీసుకెళ్లునట్లు అబద్ధం చెప్పాడని అందుకే దీప భద్ర కాళిలా ప్రవర్తించింది అని మొత్తం చెప్తుంది. కార్తీక్ షాక్ అయిపోతాడు. కన్నీరు పెట్టుకునే దీపలో ఇలాంటి క్యారెక్టర్ ఉందా అని అనుకుంటాడు. అనసూయ వెళ్లిపోతూ కార్తీక్, దీపల మధ్య సంబంధం ఉందని అది బయట పడితే అప్పుడు దీప సంగతి చెప్తా అని అనుకుంటుంది. 
imeage creadits ; hotstar

పారిజాతం పుట్టిన రోజు కారణంగా అందంగా రెడీ అవుతుంది. పార్టీ ఏర్పాట్లు జరుగుతాయి. పారిజాతం తన భర్త శివనారాయణ కాళ్లకు దండం పెడితే తన భర్త దీవెనకు బుంగమూతి పెట్టుకుంటుంది. ఇక జ్యోత్స్న అదంతా నీ మీద ప్రేమతో అని అంటుంది. ఇక దీపని పిలిచాను పాయసం చేయడానికి అని సుమిత్ర అంటే పారిజాతం కోపమవుతుంది. ఇంతలో దీప, శౌర్య వస్తారు. ఇక శివనారాయణ శౌర్యని ముద్దు పెట్టుకుంటాడు. సుమిత్ర దీపకు పాయసం చేయమని అంటుంది. తన తాత, తండ్రి, తల్లిలు దీప కూతురితో సరదాగా ఉండడంతో జ్యోత్స్న కోపంగా వాళ్లని చూస్తుంది. 

జ్యోత్స్న: గ్రానీ ఆ దీప ఇంట్లో అడుగు పెడుతుంటే నా గుండెల మీద అడుగుపెడుతున్నట్లు ఉంది. ఊపిరి ఆడటం లేదు. ఏం చేస్తావో చేయ్.


పారిజాతం: మనసులో.. అది ఏదో స్పెషల్ చేస్తుందని అందరూ దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు కదా దాని వంటను పేరు ఎత్తితే భయపడేలా చేస్తా.  

శ్రీధర్ అద్దం ముందు నిలబడి వస్తున్నా బేబీ పది నిమిషాల్లో నీ ముందు ఉంటాను అని అనుకుంటాడు. అంతలో ఎదురుగా కాంచన రావడంతో కంగారు పడతాడు. తన మాటలు వినేసిందా అని అనుకుంటాడు. ఇక కాంచన తన అన్నయ్య ఫోన్ చేశాడా అని అడుగుతుంది. శ్రీధర్ లేదు అంటే మా అన్నయ్య ఫోన్ చేయకుండా నేను చెప్పకుండా మీరు రెడీ అవుతున్నారని అంటుంది. నేను రెడీ అవుతాను ఇద్దరం వెళ్దాం అంటుంది. శ్రీధర్ కావేరి గురించి తెలిసిపోయిందేమో అని టెన్షన్ పడతాడు. పారిజాతం పుట్టిన రోజుకు వెళ్లాలి అంటే తాను రాను అంటే కాంచన ఒప్పుకోదు. ఇంతలో కావేరి నుంచి ఫోన్ వస్తుంది. శ్రీధర్ కంగారు పడతారు. కాంచన ఫోన్ దగ్గరకు వెళ్తుంటే హడావుడిగా ఫోన్ తీసుకొని ఆఫీస్ నుంచి అని చెప్పి వెళ్లిపోతాడు. 

imeage creadits ; hotstar

పారిజాతం: పుట్టిన రోజు నాది ఎంజాయ్ మెంట్ మీదా నవ్వండి నవ్వండి కాసేపట్లో బాంబ్ పేల్చుతా. ముందు దీపని అందరి చేత చీ అనిపించాలి. ఇంతలో కార్తీక్ వస్తాడు. కాంచన, శ్రీధర్‌లు రాలేదని చెప్తుంది. కార్తీక్ స్పెషల్ ఏంటి అని అడుగుతాడు.
జ్యోత్స్న: ఉంది బావ దీప పాయసం చేస్తుంది. నీకు అంతకంటే స్పెషల్ ఏముంటుంది చెప్పు.  
సుమిత్ర: జ్యోత్స్నకు ఎంత చెప్పినా జరిగింది మర్చిపోవడం లేదు.
జ్యోత్స్న: చూశావా గ్రానీ బావ నాతో మాట్లాడటానికి కూడ ఇష్టపడటం లేదు.
పారు: ఆ ఇబ్బందులు అన్నీ తీసేయడానికే నేను ఈ పుట్టిన రోజు చేసుకుంటుంది. 
జ్యోత్స్న: బావ విషయంలో నాకు భయంగా ఉంది.
పారు: నీ భయాలు అన్నీ పొగొట్టే మంత్రం నా దగ్గర ఉంది. కాసేపు ఆగు.

imeage creadits ; hotstar

బయట కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ అనసూయ చెప్పింది తలచుకొని దీపని చూస్తూ నవ్వుకుంటాడు. దీప కార్తీక్‌ని చూస్తుంది. దీప చూడగానే కార్తీక్ ముఖం తిప్పేస్తాడు. మళ్లీ దీపని చూస్తాడు. దీప కార్తీక్‌ని మళ్లీ చూస్తుంది. దీప చూడగానే కార్తీక్ వెళ్లిపోతాడు. తర్వాత మళ్లీ వచ్చి తొంగి చూస్తే దీప ఉండదు. ఇక దీప కార్తీక్ పక్కనే ఉండటంతో షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం