Skip to main content

Karthika Deepam 2 Serial 11th June episode

 Karthika Deepam 2 Serial  11th June episode :-   

కార్తీక్‌కి  శౌర్య   దీప ఫోన్‌ నుంచి కాల్ చేసి మాట్లాడటం అది జ్యోత్స్న చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.


దీప అంటే నీకు ఇష్టమని అందుకే ముందే పరిచయం ఉన్నా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అని తన భర్త ఇబ్బంది పెడుతుంటే తనకి కూడా తెలీకుండా జైలులో పెట్టావని కార్తీక్‌ని పారిజాతం నిలదీస్తుంది. కార్తీక్ పారు మీద సీరియస్ అవుతుంటే తనకు మొత్తం తెలుసని ఈ దబాయింపు ఏంటి అని అడుగుతుంది.  


కార్తీక్: నువ్వు లేని పోని ఆలోచనలు మనసులో పెట్టుకొని దీపని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి అని చూస్తున్నావ్. ఈ రోజు పాయసంలో  మందు కలిపినట్లు ఆ రోజు దీప బ్యాగ్‌లో నువ్వే నెక్లెస్ పెట్టించావ్. మరీ ఆలోచిస్తుంటే జ్యోత్స్న మనసుని చెడగొట్టింది కూడా నువ్వే.
పారిజాతం: దాని మనసుని చెడగొట్టింది నేను కాదురా నువ్వు. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఏం జరిగినా సరే నా మనవడికి మనవరాలికి పెళ్లి జరగాలి అనుకున్నాను. మీ ఇద్దరి జీవితాలు కాపాడాలి అనుకున్నాను. 




కార్తీక్: ఈ పెళ్లి జరిగితే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. నా మరదలి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు.
పారిజాతం: నా మనవడి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. 
కార్తీక్: నువ్వు ఇలాగే చేస్తే జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అందరికీ చెప్పేస్తా.
పారిజాతం: నువ్వు అలా చెప్తే ఎవర్ని మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావో నేను అది అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఎంత మొండి వాడివో నేను అంత మొండిదాన్ని. సుమిత్ర కూతురికి, కాంచన కొడుకుకి పెళ్లి జరుగుతుంది. ఇది ఆ దేవుడు రాసిన రాత గుర్తుపెట్టుకో.




దీప హోటల్‌ దగ్గర అనసూయ ఆగి కడుపునిండా తినేసి వెళ్తాను అని దీప చేసిన పనికి శోభ తినడం లేదు ఎవరికీ తిండి పెట్టడం లేదు అని ఆకలితో ఉండటం నా వల్ల కాదు అనుకొని లోపలికి వస్తుంది. కడియం ఏం కావాలని అడుగుతాడు. ఇక ఉప్మా తీసుకొని వచ్చి ఇస్తాడు. అనసూయ తిని అది దీప చేసిన ఉప్మాలా ఉంది అనుకుంటుంది. కడియాన్ని ఎవరు చేశారు అని అడిగితే దీపని చూపిస్తాడు. దీప దగ్గరకు రావడంతో అనసూయ భయంతో వెళ్లిపోతుంటే దీప ఆపి టిఫిన్ చేయమని అంటుంది. మనుషుల్ని వదిలేసిని టేస్ట్ గుర్తు పట్టి పేరు పలికారు. దీన్నే అప్యాయత, బంధాలు అంటారని అవి మీరు వదిలేసినా నేను ఇంకా పట్టుకొని తిరుగుతున్నానని అత్తకు చురకలు వేస్తుంది. ఇకపై మీరు ప్రశాంతంగా ఉండండి.. నన్ను కూడా ప్రశాంతంగా ఉంచండి అని చెప్తుంది. 

జ్యోత్స్న: బావ నీకు ఏం చెప్పాడు. నువ్వు చెప్తావా నేనే అడిగి తెలుసుకోవాలా. నేను అంటే ఇష్టం లేదా అని నేను గట్టిగా నిలదీస్తే బావ నాతో ఏదో చెప్పాలి అనుకున్నాడు. సరిగ్గా టైంకి వచ్చి నన్ను పంపేశావ్.
పారిజాతం: చెప్పాడే పెళ్లి ఇప్పుడే వద్దు రెస్టారెంట్ ఓపెనింగ్ తర్వాత చేసుకుంటా అన్నాడు. 
జ్యోత్స్న: నువ్వు అబద్ధం చెప్తున్నావ్ గ్రానీ. లేదంటే బావ ప్రమాణం చేసినప్పుడు ఎందుకు అంత ఆలోచిస్తాడు. కనీసం నవ్వలేదు కూడా. 
పారిజాతం: ఒక్కటి మాత్రం నిజం వాడికి నువ్వంటే ఇష్టం. నీ అనుమానం ఏంటి తర్వాత మాట మార్చుతాడు అనే భయం కదా. అలా మార్చితే మీ అమ్మ ఊరుకుంటుందా.. మీ అత్త ఊరుకుంటుందా. లేక నేను ఊరుకుంటానా. పారిజాతం ఏం చేసిన మనవరాలి పెళ్లి కోసమేనే. ఇదే నా జీవిత లక్ష్యం. ఎందుకు అంటే ఈ ఇంట్లో నీది నాది ఓ ప్రత్యేకమైన బంధం. నువ్వు నా సొంతం. 
జ్యోత్స్న: ఈ పెళ్లి నాకు కూడా జీవిత లక్ష్యమే. దీప రావడానికి కంటే ముందు ఉన్న బావ వేరు. దీప వచ్చిన తర్వాత బావ వేరు. నర్శింహ ఇంటికి రాక ముందు నాకు బావ మీద అనుమానం ఓ మొక్కలా ఉండేది. దానికి నీళ్లు పోసి పోసి నువ్వే దానిని చెట్టుని చేశావ్. ఇప్పటి వరకు నేను బాలేను ఇకపై బాగుంటాను. ఈ రోజు నాకు ఓ క్లారిటీ వచ్చింది. ఏం జరిగినా బావే నా మొగుడు.. ఏ చేయి నా చేతిలో వేయడానికి ఇబ్బంది పడ్డాడో అదే చేతితో నా మెడలో తాళి కట్టించుకుంటా. 



కార్తీక్ జరిగిదంతా తలచుకొని నన్ను చీట్‌ చేశావ్ అని పారిజాతం మీద కోపంతో ఆవేశంగా కారు డ్రైవ్ చేస్తాడు. ఎదురుగా ఓ అమ్మాయి(స్వప్న) స్యూటీ మీద వెళ్తూ ఓ అబ్బాయిని ఢీ కొట్టేస్తుంది. ఇక ఆ వ్యక్తి రెండు వేలు ఇవ్వమని స్వప్నని ఇబ్బంది పెడతాడు. దీంతో కార్తీక్ డబ్బులు ఇస్తాడు. ఇక స్వప్నని దగ్గరుండి కార్తీక్ హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. స్వప్న కార్తీక్‌ని పొగిడేస్తుంది. ఇక కార్తీక్ స్వప్నతో ఇంటికి ఫోన్ చేసి జరిగింది మీ డాడీతో చెప్పు హాస్పిటల్‌కి రమ్మని చెప్తాడు. తన తండ్రి చాలా బిజీ అని తనకే అప్పుడప్పుడు కనిపిస్తారు అని చెప్తుంది. తన తల్లికి ఫోన్ చేస్తా అంటుంది. ఇక ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్తారు. మరోవైపు దీప ఇంటికి వస్తుంది. దీప ఫోన్ నుంచి కార్తీక్‌కి శౌర్య కాల్ చేస్తుంది. ఇక శౌర్య ఫోన్‌లో మాట్లాడటం జ్యోత్స్న చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 



Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం