Skip to main content

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode

                                                Bookmark this site to instant open

                                                     VISIT FOR DAILY UPDATES


image credits to zee tv

 ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...

 ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది. 

ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు. 

నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంది నువ్వెలా వెళ్లొస్తున్నావ్ మా బాబాయ్ ఇక్కడ పనిచేస్తుంటేనే మాకు కలవడానికి ఇంత టైం పడుతుంది అలాంటిది నువ్వు క్యాటరింగ్ కోసం లోపలికి వెళ్లి మేనేజర్ తో మాట్లాడి వస్తున్నావా అని అంటాడు హరీష్...


వాళ్ళ మాటలకి సమాధానం చెప్పలేని ఆర్య ని చూసి జెండి అక్కడికి వచ్చి మీరెవరు అని అడుగుతాడు..

 హాయ్ సార్ నేను మా బాబాయ్ ని కలవడానికి వచ్చాను నా పేరు హరీష్ నాకు కాబోయే భార్య దివ్య మా భార్యని పరిచయం చేయడానికి వచ్చాను అని చెప్తాడు హరీష్... మీరు ఎవరు సార్ అని తెలియనట్టు అడుగుతాడు జెండి. ఇతను ఎవరో మాకు తెలియదు అని దివ్య అంటుంది...

 మిమ్మల్ని నేను అడగలేదే అని జెండి అంటాడు. నా పేరు సూర్య సార్ ఇక్కడ క్యాటరింగ్ కోసం మాట్లాడదామని వచ్చాను అని ఆర్య అంటాడు... 

ఇలాంటి వాళ్లకు ఇవ్వకండి సార్ ఇతని బట్టలు చూసావా ఇతని అవతారం చూసావా అని హరీష్ అంటాడు.. ఇక్కడ పనిని బట్టి పని ఇస్తారు కానీ బట్టలను చూసి మనిషిని చూసి కాదు అని జెండి అంటాడు. నీలాంటి తల పొగరు ఉన్న వాళ్ళు అసలు మా కంపెనీలోనే ఉండరు  మీలాంటి వాళ్ళకి అసలు మా కంపెనీలో చోటే ఉండదు అని ఆ జెండి అంటాడు...

 ఓకే సార్ మీరు మేనేజర్ గారితో మాట్లాడి నాకు ఏదైనా చెప్పండి అని ఆర్య వెళ్ళిపోతూ ఉంటాడు... ఒక్క నిమిషం అని ఆర్య దగ్గరికి వెళ్లి కౌగిలించుకొని సారు క్షమించండి అని జెండి అంటాడు.


వాళ్ళు వచ్చిన పని ఏంటో వెంకటరమణ ని కల్పించి తొందరగా పంపించేసేయ్ అని ఆర్య చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వెంకట్రావు వచ్చి హరీష్ వాళ్ళను కలుస్తాడు. హరీష్ దివ్యని పరిచయం చేస్తాడు.

 మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు అని వెంకట్రావు అంటాడు. బాబాయ్ నాకు ఈ కంపెనీ తో కాంట్రాక్టర్ మాట్లాడి పెట్టవా అని హరీష్ అంటాడు...!  ఇప్పుడే సార్ వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాక మాట్లాడి చెప్తాను అని వెంకట్రావు అంటాడు.ఇంతలో జెండి వచ్చి వెంకట్రావు నీతో కాస్త పనుంది రా అని తీసుకువెళ్తాడు. మరోవైపు , 

ఆర్య ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లి బుక్ చేయాలని అడుగుతాడు. సారీ సార్ ఇది ఖాళీ లేదు ఆల్రెడీ బుక్ అయిపోయాయి అని అతను అంటాడు. అదేంటి సార్ పొద్దున ఖాళీ ఉందని చెప్పారు వచ్చి అడిగితే లేవంటున్నారు ఏంటి అని అంటాడు ఆర్య. ఇప్పుడే కాదు సార్ సంవత్సరం దాకా కూడా ఈ ఫంక్షన్ హాల్ కాళీ లేవు అని అతను చెప్పేస్తాడు.

 ఆర్య కి ఏమీ అర్థం కాక వెళ్ళిపోతాడు. ఇంతలో జెండి ఫోన్ చేస్తాడు జెండి ఫంక్షన్ హాల్ గురించి వెతకమన్నాను కదా ఏమైనా దొరికాయా అని అంటాడు ఆర్య. లేదు ఆర్య అన్ని బుక్ అయిపోయాయని చెప్తున్నారు అని జెండి చెప్తాడు.

అదెలా సాధ్యం జెండి ఫోన్ చేసినప్పుడు ఖాళీగా ఉందంటున్నారు వెళ్లి డీటెయిల్స్ చెప్పగానే లేవంటున్నారు ఇదేంటి అని ఆర్య అంటాడు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు ఆర్య అని జెండా అంటాడు. సరే జెండి నువ్వు ఎవరో కనిపెట్టి నాకు చెప్పు అని ఆర్య అంటాడు. మరోవైపు  

 హరీష్ ఫంక్షన్ హాల్ బుకింగ్ ఎంతవరకు వచ్చింది అని ఛాయా అంటుంది. తెలియదు మేడం మా బావగారు ఫంక్షన్ హాల్ గురించే తిరుగుతున్నాడు అని హరీష్ అంటాడు. హరీష్ ఎస్వీఆర్ గార్డెన్ లోనే నా పెళ్లి చెయ్యాలని నువ్వు చెప్పు వాళ్ల నోపి వాళ్లే చచ్చినట్టు ఒప్పుకుంటారు అని ఛాయా అంటుంది. అలా గట్టిగా అంటే నా పెళ్లి ఆగిపోతుందేమో మేడం అని హరీష్ అంటాడు. 

నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్ అని ఛాయా అంటుంది,,

. ఓకే మేడం అని హరీష్ అంటాడు. ఇంతలో జెండి ఫోన్ చేసి చాయా ఇదంతా చేస్తుంది ఆర్య పెళ్లికి ఆటంకాలు కలిగిస్తుంది అని చెప్తాడు. ఓకే నేను చూసుకుంటాను జెండి అని ఆర్య అంటాడు. హరీష్ ఆర్య వాళ్ళ ఇంటికి వెళ్లి ఆంటీ నా పెళ్లి ఎస్వీఆర్ గార్డెన్ లోనే జరగాలి అని హరీష్ అంటాడు.

 ఇగో తమ్ముడు ఆ ఫంక్షన్ హాల్లో సెలబ్రెటీస్ ల పెళ్లిలు అవుతాయి దాని ఖర్చు ఎంతో తెలుసా ఐదు లక్షల దాకా వస్తుంది అని యాదగిరి అంటాడు.


బావగారు నా పెళ్లి గ్రాండ్గా చేస్తానని మాట ఇచ్చారు తను చూసుకుంటాడు లే ఏమంటావ్ బావగారు అని హరీష్ అంటాడు. అలాగే హరీష్ అని ఆర్య అంటాడు

.సూర్య అంత డబ్బు మన దగ్గర ఉంటుంది రా ఒకసారి ఆలోచించి మాట ఇవ్వు అని సుగుణ అంటుంది. దివ్య మన పెళ్లి అందులోనే జరిగేటట్టు మీ వాళ్లను ఒప్పించు అని హరీష్ వెళ్ళిపోతాడు...

 ఏంటి నీ కొడుకు 50 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు కదా ఇంకో 10 15 లక్షల పెట్టుకొని పెళ్లి గ్రాండ్గా చేయలేడా గొప్పలు చెప్పడం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని దివ్య కోపంగా అంటుంది. 

ఇగో దివ్య నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఆయన గురించి నీకు తెలవక అట్లా మాట్లాడుతున్నావ్ ఆయన మాట ఇచ్చాడు అంటే నిలబెట్టుకుంటాడు కానీ నువ్వు నోరు ముయ్ అని యాదగిరి అంటాడు. 

ఇలా గొప్పలకు పోతే దివ్య జీవితం కూడా నాలాగే పుట్టింట్లో పడి ఏడవాల్సి ఉంటుంది అబ్బాయి స్థలం ఇయ్యమన్నప్పుడే ఇచ్చేస్తే అయిపోయేది కదా అని జ్యోతి అంటుంది. ఏం చేయాలో ఆయనకు తెలుసు మీరందరూ నోరు మూసుకొని గమ్మునుండండి అని యాదగిరి అంటాడు. మరోవైపు  

 మనమిచ్చిన షాకి బ్రో ఇల్లాకి మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటాడు అని మానస అంటుంది.


ఇంతలో ఆర్య వాళ్ళ ఇంట్లో కనబడతాడు కళ్ళ ముందు ఆర్య కనబడగానే ఛాయా మానస షాక్ అయిపోతారు... ఏంటి నేను ఇలా వస్తానని మీరు ఊహించలేదు కదా నేను ఎందుకు వచ్చానో చెప్పండి అని అంటాడు.

 ఏముంది మీ చెల్లెలి పెళ్లిలో ఆటంకాలు కలిగిస్తున్నది నేనేనని కనిపెట్టి వచ్చుంటావు అని ఛాయా అంటుంది.ఎదుటి వాళ్లు బాధపడుతుంటే సంతోషించాలని అనుకోకు ఆ కుటుంభ0 బాధ్యత నేను తీసుకున్నానని నీకు తెలిసాక కూడా నువ్వు ఇలా చేస్తున్నావు నా అను నాకు కనిపించిందన్న సంతోషం ఒక్క క్షణం కూడా మిగల్చలేదు నీ అన్న మీ అన్నయ్యకి జైల్లో ఏ పరిస్థితి ఉందో చూశాక  నీకు బుద్ధి రావాలి కదా ఎదుటివారి ల్యాండ్ లాక్కోవాలని చూడకు నీకు అంత మంచిది కాదు అని ఆర్య హెచ్చరిస్తాడు...

 ఆర్య ఎప్పుడు నీ పతనని చూస్తానని ఎదురు చూస్తూ ఉంటాను కానీ నీ చెల్లెలు కానీ చెల్లె పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను అని ఛాయా అంటుంది.నాకు ఎదురు వస్తేఏమవుతుందో మీ అన్నను చూసిన తర్వాత కూడా నీకు బుద్ధి రావట్లేదు నాతో పెట్టుకోకు అని ఆర్య అంటాడు..

Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం