Skip to main content

prema entha madhuram today episode 11 december

Prema Entha Madhuram Today Episode


Bookmark this site to instant open

VISIT FOR DAILY UPDATES

image credits: hotstar





 పొద్దున్నే నిద్ర లేచిన యాదగిరి పనిచేస్తున్న జ్యోతి దగ్గరికి వచ్చి టీ ఇవ్వాలని తెలీదా అంటూ హడావిడి చేస్తాడు...

జ్యోతి ఇప్పుడే టీ పెట్టి తీసుకు వస్తాను..

యాదగిరి- వేడి నీళ్లు తోడేవా? తోడలేదు కదా పెద్దల్లుడు అంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది అంటూ కేకలు వేస్తాడు.

సుగుణ- కంగారుగా యాదగిరి దగ్గరికి వచ్చి పనిలో పడి మీకు టీ పెట్టడం మర్చిపోయింది నేను మీకు టి పెట్టి ఇస్తాను అని యాదగిరికి చెప్పి వేడి నీళ్లు తోడమని జ్యోతికి చెప్తుంది...


అదీ లెక్క ఆ మాత్రం భయం ఉండాలి అనుకుంటూ గుమ్మం దగ్గరకి వచ్చేసరికి ఆర్య పాల ప్యాకెట్లు తీసుకొని వస్తూ కనిపిస్తాడు. కంగారు పడతాడు యాదగిరి...

యాదగిరి- అయ్యో బావ, నువ్వు ఎందుకు పాలు ప్యాకెట్లకి వెళ్లావు నాకు చెప్పొచ్చు కదా నేను తెచ్చేవాడిని కదా అంటాడు..

జ్యోతి- అప్పుడే అక్కడికి వచ్చి వేడి నీళ్లు తోడేసాను అని చెప్తుంది..

యాదగిరి- ఆర్యవైపు చూస్తూ కంగారుపడుతూ నేనేదో సరదాగా అన్నాను... 
నువ్వు వేడి నీళ్లు తోడేసావా, వేడినీళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు నేను చల్లనీళ్లు స్నానం చేస్తాను అని ఓవరాక్షన్ చేస్తాడు..

ఆ తర్వాత వంట చేస్తున్న సుగుణతో ఎప్పుడూ నీ కొడుక్కి ఇష్టమైన వంటలేనా అంతలా ఏం మాయ చేసాడు అంటుంది దివ్య..

జ్యోతి- ఆ సంగతి పక్కన పెట్టు మా ఆయన అన్నయ్యని చూడగానే పిల్లిలాగా అయిపోతున్నాడు అంటుంది..

ఉష - అదే అక్క నాకు అర్థం కావట్లేదు పోనీ వాళ్లకి ముందు పరిచయం ఉందా అంటే లేదు అంటున్నారు..
  ఇన్నాళ్ళు మన వెనుక ఎవరూ లేరని అతి చేశాడు బావ, ఇప్పుడు అన్నయ్యని చూసేసరికి వేషాలు వేస్తే నాలుగు తగులుతాయి అని భయపడి ఉంటాడు అని నవ్వుతుంది.

జ్యోతి- పోనీలే ఏదైతేనేమి మా ఆయనలో మార్పు వచ్చింది అదే చాలు..

సుగుణ - సూర్య ముఖంలో ఉన్న కళ అలాంటిది. వాడిని చూస్తే ఎవరైనా గౌరవిస్తారు అంటుంది..

ఆ తర్వాత పిల్లలతో పాటు ఉష బయట ఆడుతూ ఉంటుంది.

యాదగిరి- అప్పుడే అక్కడికి వచ్చి పొద్దునుంచి హడావుడిలో అడగడం మర్చిపోయాను ఈ పిల్లలు ఎవరు అని అడుగుతాడు..

ఉష - రాధ గారని మనకి బాగా కావలసినవారు, అక్క పెళ్లి అయ్యేంత వరకు మనతోనే ఉంటారు అని చెప్తుంది..

యాదగిరి- అవునా అంటూ ఆ పిల్లలతో తను కూడా ఆడటం ప్రారంభిస్తాడు. ఆటలో భాగంగా బాల్ అను రూమ్ లోకి వెళ్ళిపోతుంది.. 

నేను తీసుకు వస్తాను అంటూ వెళ్తాడు యాదగిరి. అక్కడ అనుని చూసి షాకవుతాడు..

యాదగిరి - అను మేడం మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అంతలోనే నా పిచ్చి గానీ ఆర్య సార్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇంకెక్కడ ఉంటారు అంటాడు..

ఉష - ఈవిడే బావగారు రాధ గారంటే అంటుంది..

యాదగిరి- కన్ఫ్యూజ్ అవుతూ ఈవిడ రాధగారేంటి, ఈవిడ అను మేడం అంటాడు..

కన్ఫ్యూజ్ అవుతుంది ఉష..

అను- కంగారుపడుతూ నేను అనుని కాదు అను మేడం దగ్గర బోటిక్ లో పని చేసేదాన్ని అని ఏవేవో అబద్దాలు చెప్తుంది..

ఆ మాటలకి పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతాడు యాదగిరి. అవునా అంటూ బాల్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఉష..

యాదగిరి- పూర్తిగా కన్ఫ్యూషన్ లో పడిపోయి ఏం జరిగింది అని అనుని అడుగుతాడు..

అను ఎంతకీ మాట్లాడకపోవడంతో నేను ముందు లెక్క కాదు మంచి చెడు చూసుకొని మాట్లాడుతున్నాను,
 నీ అన్న లాంటివాడిని అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు.

అను- జరిగిందంతా చెప్పి ఎవరికీ చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది..

యాదగిరి- ఎవరికి చెప్పనమ్మా, ఈరోజు బాధపడినా రేపు మీరందరూ కలుస్తారు, 
మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచే జరుగుతుంది అని ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత సుగుణ ఇంటికి హరిష్ తన తల్లిదండ్రులతో వస్తాడు. కట్నం కావాలని డిమాండ్ చేస్తాడు..

సుగుణ- కట్నాలు ఏమి అక్కర్లేదు పెళ్లి గ్రాండ్గా చేయమన్నారు.. మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అంటుంది..

సూర్య- డౌరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు..

హరీష్- 50 లక్షలు..

ఆ మాటకి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాకైపోతారు..

దివ్య- మా ఇంటి పరిస్థితి తెలుసు కదా అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాము..
.
హరీష్- అందుకే డబ్బు పరంగా కాదు మీకు ల్యాండ్ ఉంది కదా అది ఇస్తే చాలు.

సుగుణ- అది నా పిల్లల భవిష్యత్తు కోసం దాచినది, నా పిల్లలకు ఇవ్వటానికి అది తప్పితే వేరే ఏమీ లేదు అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది... 

Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం