Skip to main content

Brahmamudi December 02 Episode


   Bookmark this site to instant open

     VISIT FOR DAILY UPDATES

రాజ్ ని బోల్తా కొట్టించిన కావ్య.. కనకంకి ఊహించని ఝలక్ ఇచ్చిన రుద్రాణి



మీకు శృతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని రాజ్ ని కావ్య నిలదీస్తుంది. నేను బాస్ ని తను ఎంప్లాయ్ అని రాజ్ అంటాడు. అవునా ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి ఆఫీసులో ఇంకొక అమ్మాయిని తగులుకున్నావు అని కావ్య అంటుంది. శృతికి నాకు సంబంధం ఉందని నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని రాజ్ కావ్య నిలదీస్తాడు. సాక్ష్యం కావాలా అని కావ్య అంటుంది ఒకవేళ సాక్ష్యం చూపిస్తే మీరు నిజం ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ముందు నువ్వు సాక్ష్యం చూపించు అని రాజ్ గట్టిగా అంటాడు....

చూడండి రాజ్ అని  శృతి తో ఉన్న ఫోటో కావ్య చూపిస్తుంది. చూశారా ఇప్పుడు చెప్పండి. మీ ఇద్దరి మధ్య ఏం లేదని అంటారా ఆ చనువు నేను చూశాను అని కావ్య అంటుంది. ఇదా ఈ ఫోటో చూసి నువ్వు ఇలా సంబంధం అంట కట్టేస్తావా ఆఫీస్ లో ఒక కొలీగ్ తో కాస్త క్లోజ్ గా ఉంటే ఇలా అనేస్తావ అని రాజ్ అంటాడు. ఒక ఫోటో చూసి ఒక అమ్మాయి మీద నింద వేస్తావా.. అనుమానిస్తావా అని అంటాడు రాజ్. ఒక ఆడపిల్లని అనుమానించడం కాదు ఇప్పుడు నాకు మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని సాక్ష్యం కావాలి అని అంటుంది. ఒక ఫోటోతో నేను ఇప్పుడు సాక్షాలు ఎక్కడి నుంచి తేవాలి అని అంటాడు రాజ్. మరి ఒక ఫోటోతో మా అక్కని అనుమానించి సాక్షాలు తెమ్మంటున్నారు కదా అని అంటుంది కావ్య. కేవలం ఒక్క ఫోటో చూసే కదా మీరు మీ అత్త అందరూ మా అక్కని అనుమానించారు అని కావ్య సూటిగా రాజ్ ప్రశ్నిస్తుంది. ఒక ఫోటో చూసి ఒక అమ్మాయి మీద నింద వేస్తారా అని మీరు ఇప్పుడే అడిగారే మీరు చేసింది కూడా అదే కదా అని కావ్య అంటుంది. కేవలం ఫోటోలు చూసే కదా, ఏం న్యాయం ఇది అని అంటుంది. వెంటనే రాజు ఆలోచనలో పడతాడు. ఇప్పుడు కూడా మీరు కింద రాహుల్ ని సపోర్ట్ చేసి వచ్చారు.....

ఎందుకు మీకు ఇంత పక్షపాతం నేను మీ గురించి శృతి గురించి ఇలా మాట్లాడినందుకే మీకు ఇంత కోపం వచ్చింది. మరి మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి తన వ్యక్తిత్వం మీద అలా మాట్లాడితే తనకి కోపం రావటం కూడా అంతే నిజం. మరి మీరెందుకు రాహుల్ కి సపోర్ట్ చేస్తున్నారు మా అక్కకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు మా అక్క పరాయి మనిషనా.. మీ ఇంటి ఆడపిల్ల కాదన ఇకనుంచైనా ఒకరి మీద నింద వేసే ముందు సాధ్య ఆసాధ్యాలు గురించి ఆలోచించి వేయండి అని కావ్య రాజ్ కి గట్టిగా క్లాస్ పీకుతుంది. ఇక వెంటనే కావ్య బెడ్ మీద పడుకుంటుంది రాజ్ కావ్య చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ తన దగ్గరకు వెళ్తాడు కానీ కావ్య రాజ్ కి మాట్లాడే ఛాన్స్ ను కూడా ఇవ్వదు. కానీ రాజ్ తన మనసులో ఉన్న ప్రశ్నలు అడుగుతాడు. కావ్య క్లారిఫికేషన్ ఇస్తుంది. ఇక ఫైనల్ గా ఒక్క ప్రశ్న నువ్వు నాకు శృతికి ఏమైనా ఉంది అంటే నమ్మవా నమ్మలేదా అని రాజ్ అడుగుతాడు మీకు అంత సీన్ లేదులే వెళ్లి పడుకోండి అని కావ్య అంటుంది. ఏంటి అని రాజ్ పెద్దగా అనగానే మీకు అంత సీన్ ఉంది కానీ ఆ సీన్ లో నేను లేను కదా అని అంటుంది...


ఏంటో పెద్ద వాళ్ళ మాటంటే ఎవ్వరికి లెక్క లేకుండా పోయింది అని ధాన్యలక్ష్మి కావ్య వంట చేస్తుండగా అంటుంది. స్వప్న శాంత ని కాఫీ అడిగింది. కానీ, రుద్రాణి తనని కాఫీ తాగడానికి సిగ్గు లేదా అని అరిచింది ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా తను తప్పు చేసిందా లేదా అనేది తర్వాత విషయం, కనీసం తనని మనిషిలాగనైనా చూడాలి కదా అని ధాన్యలక్ష్మి తన ఆవేదనని వ్యక్తం చేస్తుంది. స్వప్న అతనికి డబ్బులు ఇవ్వకోకోకుండా ఉండుంటే మంచిది ఉంటే ఈరోజు తనకి నేను సపోర్ట్ చేసి ఉండే దానిని అని ధాన్యలక్ష్మి అంటుంది. రుద్రాణి ఈ నెల రోజులపాటు ఇలాగే ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తారు ఏదో ఒకటి చేయాలి అని కావ్యా అనుకుంటుంది. అప్పుడే కావ్య ఫోన్ రింగ్ అవుతుంది. అక్క నువ్వు అడిగినట్టు ఆ అరవింద్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాను. ఆ అడ్రస్స్ మీకు పెట్టాను అని అంటాడు.....

ఇక వెంటనే కావ్య రాజ్ దగ్గరకు వెళ్లి ఏవండి మనం బయటికి వెళ్లాలి పదండి అని అంటుంది. నేను ఒక ఆఫీస్ కి ఎండిని నీ కింద కాదు అని అంటాడు. ఏవండీ ఆ అరుణ్ ఇంటి అడ్రస్ దొరికింది. చూడు ఇంట్లో వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు. తను ఏమైనా చేసుకొని నాకు అనవసరం అని అంటాడు. కావ్య కూడా ఇండైరక్ట్ గా రాజ్ నీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గనక మనం అతనిని వెతికి పట్టుకుంటే రేపటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారని నేను ప్రయత్నిస్తున్నాను. నీకు ఇవేమీ అవసరం లేదు కదా కేవలం బిజినెస్ మాత్రమే కావాలి కానీ, తాతయ్య గారికి ఇంట్లో జరిగే గొడవలు కనిపించకుండా ఉండాలంటే ఇలా చేస్తేనే బెటర్ అని కావ్య సలహా ఇస్తుంది. ఇప్పుడు చెబుతున్నాను వినండి కేవలం స్వప్న మా అక్కే కావచ్చు కానీ నేను ఇదంతా చేస్తుంది మాత్రం తన కోసం కాదు ఈ ఇంట్లోవాళ్లు సంతోషం కోసం. అది మీకు అర్థమైంది ఉంటే మీరు ఇలా మాట్లాడే వాళ్ళు కాదు అని కావ్య అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళావతి చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని గమనించిన రాజ్, అతనిని ఇప్పుడే ఇంటికి తీసుకువస్తే ఈ సమస్య ఇంతటితో ముగిసిపోతుంది కదా అని రాజ్ అనుకుంటాడు....





కళ్యాణ్, అనామిక ల పెళ్లి ముహూర్తం గురించి ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. అరేయ్ రాజ్ నీతో ఒక మాట మాట్లాడాలి అనగానే నాకు వేరే పని ఉంది అని కావ్య నీ వేతుకుంటు వంట గది లోకి వస్తాడు. కావ్య కావాలని బెట్టు చేస్తుంది. మరోవైపు రుద్రాణి రాజ్ తన భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అని అపర్ణ ముందు కావాలని లేనిపోయినవి చెప్తుంది. నీకు కొంగు ఉంది ఏం లాభం వదిలేసి వచ్చావు అని ధన్యాలక్ష్మీ చెబుతుంది. కావ్య వంట చేస్తుండగా రాజ్ తనని ఎలాగోలా మాట్లాడించి తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఏం కావాలి అని అంటే నువ్వే కావాలి అని రాజ్ కవ్యతో అంటడు. నిజంగా అని కావ్య రాగం తీస్తుంది. ఏయ్ నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు అని కావ్య కాఫీ తీసుకుని హల్ లోకి వస్తుంది. అందరికీ కాఫీ ఇస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ రాజ్ చేసే వాటిని చూస్తూ లోలోపల నవ్వుకొన్నారు. రాజ్ బయటకు వెళ్దాం అన్నవుగా రా వెళ్దాం అని అంటాడు. మొత్తానికి కవ్యని తీసుకుని అలా బయటకు వెళ్లి వస్తాం అంటాడు....
అంటే నేను వద్దన్నా నువ్వు వెళ్తావ అని కనకం ని మూర్తి అడుగుతాడు. నువ్వు స్వప్న ప్రెగ్నెంట్ అయిందని సంబరపడుతున్నావు కానీ ఆ స్వప్న కావ్య జీవితాన్ని పణంగా పెట్టైనా సరే ఆ ఇంట్లో ఉండాలని అనుకుంటుంది నువ్వు ఆ విషయం గురించి ఆలోచించవా అని మూర్తి కనకంకి చివాట్లు పడతాడు. తప్పు చేసిన అది నా కూతురే కదా అని కనకం అంటుంది. అవకాశం వస్తే కావ్య నే కాదు నిన్ను కూడా ఆ ఇంట్లో దోషిగా నిలబెడుతుంది స్వప్న అని మూర్తి వార్నింగ్ ఇస్తాడు కనకంకి.









Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం