Skip to main content

Posts

Showing posts from June, 2024

Karthika Deepam 2 Serial 11th June episode

 Karthika Deepam 2 Serial  11th June episode :-    కార్తీక్‌కి  శౌర్య   దీప ఫోన్‌ నుంచి కాల్ చేసి మాట్లాడటం అది జ్యోత్స్న చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. దీప అంటే నీకు ఇష్టమని అందుకే ముందే పరిచయం ఉన్నా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అని తన భర్త ఇబ్బంది పెడుతుంటే తనకి కూడా తెలీకుండా జైలులో పెట్టావని కార్తీక్‌ని పారిజాతం నిలదీస్తుంది. కార్తీక్ పారు మీద సీరియస్ అవుతుంటే తనకు మొత్తం తెలుసని ఈ దబాయింపు ఏంటి అని అడుగుతుంది.   కార్తీక్:  నువ్వు లేని పోని ఆలోచనలు మనసులో పెట్టుకొని దీపని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలి అని చూస్తున్నావ్. ఈ రోజు పాయసంలో  మందు కలిపినట్లు ఆ రోజు దీప బ్యాగ్‌లో నువ్వే నెక్లెస్ పెట్టించావ్. మరీ ఆలోచిస్తుంటే జ్యోత్స్న మనసుని చెడగొట్టింది కూడా నువ్వే. పారిజాతం:  దాని మనసుని చెడగొట్టింది నేను కాదురా నువ్వు. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఏం జరిగినా సరే నా మనవడికి మనవరాలికి పెళ్లి జరగాలి అనుకున్నాను. మీ ఇద్దరి జీవితాలు కాపాడాలి అనుకున్నాను.  కార్తీక్:  ఈ పెళ్లి జరిగితే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. నేను జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేను. నా మరదలి జీవితం నాశ

Karthika Deepam 2 Serial Today 7th June episode

Karthika Deepam 2 Serial Today 7th June  episode :- దీపని తొంగి తొంగి చూస్తూ మెలికలు తిరిగిపోతున్న కార్తీక్.. బాంబ్ పేల్చనున్న పారిజాతం! Today episode: - imeage creadits ; hotstar కార్తీక్‌ శౌర్య, దీపల చుట్టూ తిరగడాన్ని కాంచన నిలదీస్తుంది. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నీ ప్రవర్తన చూస్తుంటే పారిజాతం పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుందని అంటుంది. శ్రీధర్ ఆపడానికి ప్రయత్నిస్తే కార్తీక్ వద్దని పక్కనే కూర్చొని మరో సారి మన మధ్య ఇలాంటి టాపిక్ రాకూడదు అని, తన అత్త కూడా అలా అడగలేదు అని అత్తి నమ్మినప్పుడు అమ్మవి నువ్వు నన్ను నమ్మడం లేదు ఏంటా అని బాధగా ఉందని అంటాడు. కాంచన కార్తీక్, జ్యోత్స్నలకు నిశ్చితార్థం చేసేద్దామని అంటుంది.  imeage creadits ; hotstar ఇక అనసూయ సరుకుల కోసం నడుచుకుంటూ వస్తుంది. దీపని చూసి భయపడుతుంది. దీప కంట్లో పడితే నర్శింహ మీద మిగిలిపోయిన కోపం ఉంటే తన తాట తీస్తుందని పరుగులు పెడుతుంది. ఇక కార్తీక్‌ని ఢీ కొడుతుంది. కార్తీక్ ఎందుకు భయంతో పరుగెడుతున్నారు అని అంటే దీపని చూసి అని చెప్తుంది. మిమల్ని చూసి దీప భయపడాలి కానీ మీరు భయపడటం ఏంటి అని కార్తీక్ అడిగితే రాత్రి నుంచి

prema entha madhuram today episode june 6 th

 Prema entha madhuram today episode :- వర్థన్‌ ఫ్యామిలీని ఊరొదిలి వెళ్లిపోమ్మన్న స్వామి  Today  Serial  Episode  :-    Prema Entha Madhuram  Serial Today Episode :   వర్దన్‌ కుటుంబంలో వ్రతం చేయడానిని అన్ని ఏర్పట్లు చేస్తారు. ఊరి జనం కూడా వ్రతానికి వస్తుంటారు. అంతా హడావిడిగా ఉంటుంది. ఇంట్లో వ్రతానికి రెడీ అవుతున్న ఆర్య పంచె కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఇంతలో అను వచ్చి ఆర్యకు పంచె కడుతుంది. దీంతో ఆర్య అనుకు థాంక్స్‌ చెబుతాడు. ఆర్య:  మన ఇంట్లో ఎప్పుడు వ్రతం జరిగినా నువ్వు మహాలక్ష్మిలా నగలు వేసుకుని వ్రతంలో కూర్చునే దానివి. కానీ ఇప్పుడు అను:  సార్‌ నువ్వు పక్కన ఉండటమే నాకు పెద్ద అలంకారం ఇక నగలతో నాకేం పని రండి సార్‌.  భానుకు తాకట్టు పెట్టమని ఇచ్చిన నగలు టేబుల్‌ మీద కనిపిస్తాయి. సార్‌ ఈ నగలు తాకట్టుపెట్టమని భానుకు ఇచ్చాము కదా అని అందులో ఉన్న లెటర్‌ చదువుతుంది. అందులో మా అక్క ఎప్పడు లక్ష్మీదేవిలా ఉండాలి అని రాసి ఉంటుంది. సరే అని ఇద్దరూ వ్రతానికి వెళ్తారు. వర్థన్‌ ఇంటి దగ్గరకు నీలకంఠం వస్తాడు. అటు ఇటు తిరుగుతుంటే.. అమ్మాయి కోసం చూస్తున్నారా? అని కోటి అడిగితే తల్లీకూతుళ్లను ఇంట్లో పెట్టి

Karthika Deepam 2 Serial Today 6thJune episode

  Karthika Deepam 2 Serial Today 6thJune  episode :  దీప ఇచ్చిన వార్నింగ్‌కు నర్శింహ, శోభలు దీపని సిటీ నుంచి పంపించే వరకు వదిలే లేదు అని అనసూయతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode  :  image creadits: hotstar పాపకి ఏం తినపించలేదు అని దీప కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. ఇంతలో శౌర్య తనకి బయటకు తీసుకెళ్లి తినిపించాడు అని చెప్తుంది. ఇక శౌర్యని దీప లోపలికి వెళ్లి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది. ఇక దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటారు. ఇక దీప కార్తీక్‌తో శౌర్యకు కొత్త కొత్త రుచులు అలవాటు చేయొద్దని దానికి దగ్గర అవ్వొద్దని చెప్తుంది. పరిస్థితులు చక్కబడ్డాక ఇంకో ఇళ్లు చూసుకొని వెళ్లిపోతామని దీప చెప్తుంది. ఇక కార్తీక్ వెళ్తుంటాడు. శౌర్య వచ్చి కార్తీక్‌కు థ్యాంక్స్ చెప్పావా అంటుంది. దీప లేదు అంటే బుంగ మూతి పెట్టుకుంటుంది. దీంతో దీప కార్తీక్‌ దగ్గరకు వెళ్తుంది. కార్తీక్ దీపతో తిట్టాల్సినవి ఏమైనా మర్చిపోయారా అండీ అని అడుగుతాడు. దీప లేదు అని థ్యాంక్స్ చెప్తుంది.  పారిజాతం:  ఆహా చిలకా గోరింకల్లాగా ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో.. సారీలు, థ్యాంక్స్