Skip to main content

prema entha madhuram today episode.. jan 5

 

అనుని పెళ్లికి ఒప్పించడానికి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పిల్లలు..



image credits : zee 5




మీరు ఆ పని మాత్రం చేయకండి అని అను అంటుంది.

ఆర్య: రాధ గారు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్ల మీకు నష్టమేమీ జరగదు పెళ్లి లోపు నీ భర్తని వెతికితేస్తాను  అంటాడు.

అను : ఈ జన్మకు నాకు పిల్లలు పిల్లలకు నేను అంతే ఇంకే బంధం నాకు అక్కర్లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని  అంటుంది. 

ఆర్య : మీరు పిల్లల గురించి అయినా అర్థం చేసుకోవాలి కదా అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నేను ఆ సమస్యకు పరిష్కారం వెతికేది రాద గారు ఈ పెళ్లి వల్ల మీకు నష్టం మాత్రం జరగదు నన్ను నమ్మండి లేదు అంటే మాత్రం మన ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి మీకోసం నేను అధ్యాయం చేస్తాను కానీ నీకు మాత్రం ఎలాంటి ఆపద కలగనివ్వను అని  వెళ్ళిపోతాడు.

మరోవైపు  అను పిల్లల దగ్గరికి వెళ్లి  ఏడుస్తూ ఉంటుంది.
 
మీరు తండ్రి కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు కానీ నేను మీ నాన్న దగ్గరికి చేర్చలేను నన్ను క్షమించండి ఈ జన్మకు మన ముగ్గురం మాత్రమే ఇక్కడే ఉంటే అనార్థం జరుగుతుంది పిల్లల్ని తీసుకుని ఎవరికీ కనబడనంత దూరం వెళ్ళిపోతాను అని అను ఏడుస్తుంది.

మరోవైపు  ,  రూమంతా సాంబ్రాణి పొగతో నింపేస్తాడు యాదగిరి . ఏం చేస్తున్నారండి అని  అడుగుతుంది జ్యోతి.

యాదగిరి  : మనకు కొత్తగా పెళ్లయింది కదా శోభనం జరుగుద్దా నువ్వు బెడన్ పెట్టి లోపలికి రా అని అంటాడు

సిగ్గుపడుతూ బెడన్ పెట్టి మంచి నీళ్లు తీసుకుని వస్తుంది జ్యోతి . 

యాదగిరినువ్వు అంత సిగ్గు పడకు గానే అలమరలో పొట్లం ఉంది తీసుకురా అని  అంటాడు.

జ్యోతి : ఏమున్నాయి అండి అందులో మల్లెపూల అని  వెళ్లి పొట్లం తెచ్చి యాదగిరి ఇచ్చి  తలలో పెట్టమంటుంది. 
 
యాదగిరి : ఓ సి పిచ్చి మొద్దు నీ తేలివి తెల్లారినట్టే ఉంది అవి మల్లెపూలు కాదే పకోడీ అని  అంటాడు. 

జ్యోతి : ఇంత సెటప్ ఇంత బిల్డప్ ఇచ్చింది పకోడి కోసమా ఇంకా దేనికో అనుకున్నాను అని  ఉంటుంది.

యాదగిరి : అలా అనకు జ్యోతి అని తన చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి ప్రేమగా జ్యోతి వంక చూస్తూ మందు బాటిల్ తీసి ఓపెన్ చేసి గ్లాసులో పోసుకుంటాడు,

యాదగిరి : ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఈ మాత్రం సెటప్ ఉండాలి కదా లేదంటే అనుమానం వచ్చేస్తుంది అని  అంటాడు. 

జ్యోతి  : అయినా ఏంటండీ మీరు మారిపోయారు మా అన్నయ్య బజన చేస్తున్నారు ఏం మందు పెట్టి మాయ చేశాడు అని  అంటుంది. 

యాదగిరి : నువ్వు బావ గురించి ఎక్కువ మాట్లాడావు అనుకో ఈ మందులో విషయం కలిపి తాగిస్తాను దెబ్బకి చచ్చి ఊరుకుంటావని  అంటాడు.

  జ్యోతి : ఆ మాట వినగానే గప్చిపున నోరు మూసుకొని పడుకుంటుంది.  ఆనందంగా యాదగిరి మందు తాగుతాడు. మరోవైపు  ,

 సుగుణ :జ్యోతి ఉష  ఇల్లంతా శుభ్రం చేయండి ఇందాక వెళ్లి గురుస్వామితో మాట్లాడాను పిల్లల పరిస్థితి చెప్తే దీక్షా విరమించవచ్చని చెప్పారు...

 తొందరగా కానివ్వండి  గురువుగారు వచ్చేస్తారు ఈ అయ్యప్ప పూజ చేస్తూ ఉంటే ఇంట్లో పెళ్లి శుభకార్యం చేయకూడదంట దీక్ష విరమించాక పంతులుగారు వచ్చి పెళ్లికి ముహూర్తం పెడతాడు అని  అంటుంది.

దివ్య : అమ్మ మాకు ముహూర్తం ఎప్పుడు పెట్టేసారు కదా మళ్ళీ కొత్తగా పెట్టడమేంటి అని  అంటుంది.

సుగుణ : దివ్య  మీకు ముహూర్తం కాదే రాధకి సూర్యకి పెళ్లి ముహూర్తం అని  అంటుంది.

అను : కంగారు పడిపోయిన  కొంగు ముసుగు వేసుకొని వచ్చి ..ఎందుకు ఇదంతా చేస్తున్నారు  ఎందుకు బలవంతం చేస్తారు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా  అని అంటుంది.

సుగుణ : ఏంటమ్మా నీ రక్తసంబంధీకులు ఇదే నీ బంధువులో  అయితే ఇలాగే మాట్లాడే దానివా అని  అంటుంది.

అను  : మీరంటే చాలా గౌరవం ఆంటీ మీరు రక్తసంబంధీకులు కాకపోయినా  అందుకే మీ మాటకు ఎదురు చెప్పట్లేదు ఆంటీ  కానీ నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది. 

ఆర్య  :ఎందుకమ్మా బలవంతం చేయడం  అమ్మ రాధ గారికి ఇష్టం లేదు అంటుంటే  అని అంటాడు.

సుగుణ : సూర్య పిల్లల ముందే ఇవాళ ఈ విషయం అటు ఇటు తేలిపోవాలి  ఉష నువ్వు వెళ్లి పిల్లల్ని తీసుకురా అని  అంటుంది. మరోవైపు  

ఉషా పూజ మందిరంలోకి వెళ్లి చూసేసరికి పిల్లలు లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతారు అది చూసినా ఉష అన్నయ్య ఇంట్లో పిల్లలు లేరు ఎక్కడికొ వెళ్ళిపోయారు అని అంటుంది. 

 గబగబా అందరూ వెళ్లి చూసేసరికి లెటర్  ఆక్కడ ఉంటుంది ఆర్య లెటర్ చదివి షాక్ అయిపోతాడు. 

 నువ్వు ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే కానీ మేము ఇంటికి తిరిగి రాము అమ్మ మమ్మల్ని క్షమించమ్మా...   ఐ మిస్ యు ఫ్రెండ్ అని రాసిపెట్టి పిల్లలు వెళ్లి పోతారు.

ఆర్య : పిల్లలు ఎంత దూరం వెళ్లి ఉండరు పదా వెళ్లి వెతుకుదామని  అంటాడు. 

ఆ లెటర్ చూసుకుంటూ  అను గుండెలు పగిలిలా ఏడుస్తుంది. ఉష పిల్లల్ని మనం కూడా వెతుకుదాం పద అని అను వెళ్ళిపోతుంది. మరోవైపు  , 

యాదగిరి ఆర్య  పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు.ఒకచోట పిల్లలకు ఆర్య కనపడగానే ఆర్య చూడకుండా పిల్లలు దాక్కుంటారు. చూసుకోకుండా  ఆర్య ముందుకు వెళ్లి పిల్లల గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటాడు. ఉష అను  పిల్లల కోసం వీధిలన్నీ వెతుకుతూ ఉంటారు. 

ఉష  : రాధ గారు నేను పార్క్ దగ్గర వెతుకుతాను మీరు వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అడగండి అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది






Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం