Skip to main content

Krishna Mukunda Murari 29 november episode

Click the Bell icon to update notifications on your mobile

మురారి ముందు కృష్ణని అడ్డంగా బుక్ చేసిన ముకుందా..



రేవతి అత్తయ్య మీరు జరుగుతుంది అంటే సరిపోదు అందుకు తగ్గ ఆధారాలు చూపించండి అని ముకుంద నిలదీస్తుంది. పెద్దపల్లి ప్రభాకర్ చెట్లమ్మ చెల్లమ్మ అని చెప్పాడే కానీ, వాటితో పాటు మర్డర్ చేశాను అన్న విషయాన్ని దాచి పెట్టాడు. మురారి మీద మర్డర్ అటెండ్ చేసి జైలుకు వెళ్లాడు. ఇంత చెప్పినా కూడా మీరు కృష్ణ భజన చేయడం మీ వయసుకి కరెక్ట్ కాదు అత్తయ్య అని ముకుందా హితబోధ చేస్తుంది. రేవతి కోపంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని అరుస్తుంది...

నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను అత్తయ్య, అయినా నేను నిజాలే చెబుతున్నాను అత్తయ్య మీలా నేను బ్రమలో బ్రతకడం లేదు వాస్తవంలో బ్రతుకుతున్నాను అని ముకుందా సర్ది చెప్పుకుంటుంది. ఇకనైనా మీరు మీ మనసు మార్చుకొని మా అత్తయ్య చెప్పినట్లు నడుచుకోండి. మా అత్తయ్య ఏం పిచ్చిది కాదు అని అనగానే మా అక్క ఏం పిచ్చిది కాదు. నువ్వే తనని మాయ మాటలు చెప్పి మార్చేసావు అని రేవతి కోపంగా అంటుంది. నేను చెబితే మారిపోయి నమ్మేంత పిచ్చిది కాదు అని ఈ సిటీలో అందరికీ భవాని అత్తయ్య ఆటిట్యూడ్ గురించి తెలుసు అని ముకుందా కవర్ చేసుకుంటుంది. సో బి రెడీ పెళ్లి పనులు మొదలు పెట్టండి. నీకు సిగ్గు లేదా అని రేవతి అంటుంది.

మురారి వాళ్ల పెద్దమ్మ చెప్పిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రెండు రోజుల్లో ఏదో నిజం చెబుతానని అంది ఆ విషయం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భవాని అక్కడికి వస్తుంది ఏం ఆలోచిస్తున్నావు నాన్న అని అంటే మీరు చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నాను అని మురారి అంటాడు. నువ్వు ఇలా ఆలోచిస్తావని తెలిసే రెండు రోజుల్లో చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడే చెబుతున్నాను అని చెబుతోంది. మనసులో మాత్రం దేవుడా ఈ అబద్దం ఆడుతున్నందుకు నన్ను క్షమించు అని భవాని మనసులో అనుకుంటుంది. మురారి నీకు గతం గురించి చెప్పకూడదని అనుకున్నాను మురారి కానీ, ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నా గతం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైజ్ మెంట్ గా ఉంది పెద్దమ్మ అని మురారి అంటాడు. నువ్వు గతంలో ప్రేమలో ఉన్నావు మురారి. నేను ఎవరి ప్రేమలో ఉన్నాను, ఎవరిని ప్రేమించాను అని భవానిని ఉత్సాహంగా అడుగుతాడు మురారి. ముకుంద అని భవాని అనగానే మురారి గొంతు మూగబోతుంది. కానీ నాకెందుకో ఈ విషయం నమ్మబుద్ధి కావడం లేదు పెద్దమ్మ అని మురారి అంటాడు.
నువ్వు కృష్ణ గురించే ఆలోచిస్తున్నావు కదా నాన్న, ఆ స్పేస్ లో నుంచి నువ్వు బయటకు వస్తే ముకుంద గురించి కాదు మా గురించి కూడా నువ్వు ఆలోచించగలుగుతావు. ప్రస్తుతానికి ఆ కృష్ణ నిన్ను ఆలోచించుకోవడానికి స్పేస్ ఇవ్వడం లేదో, నువ్వే ఆలోచించడానికి ఇష్టపడటం లేదో మాకు అర్థం కావడం లేదు. కొన్ని కొన్ని నిజాలు కఠినంగా ఉండొచ్చు కానీ అవి వాస్తవాలు మురారి ముకుందా నువ్వు ప్రేమించుకున్నారు. కాబట్టి మీ ప్రేమను అంగీకరించడమే కాకుండా మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని భవాని సూటిగా తను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతుంది


కృష్ణ వాళ్ళ పెళ్లి ఫోటో చూసి మీకు ఎప్పుడు గతం గుర్తుకు వస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ముకుందా అక్కడికి వచ్చి కృష్ణ చేతిలో ఉన్న ఫోటోని లాక్కుంటుంది ఇక వెంటనే చిన్నమ్మ అని ప్రేమగా శకుంతలని పిలిచి దీపం వెలిగించాలి అగ్గిపెట్టి ఇవ్వమని అడుగుతుంది. కృష్ణం ముందే కృష్ణ పెళ్లి ఫోటోని అంటించడానికి చూస్తుంది కానీ కృష్ణ ఫేస్ లో ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇక మరోసారి ముకుందా ఆ ఫోటోని కాల్ చేస్తూ ఉండగా కృష్ణ ముకుంద చేతిలో నుంచి ఆ ఫోటో లాక్కొని ఇదే ఫోటోని నేను ఏసీబీ సార్ కి చూపిస్తాను. ఎవరు కాల్చారు అని అడిగితే నీ మీదే చెబుతాను అని కృష్ణ అంటుంది. అయినా ఇక్కడున్న ఫోటోని కలుస్తావు కానీ నా గుండెల్లో ఉన్న ముద్రని మాత్రం నువ్వు కాల్చలేవు అని కృష్ణ అంటుంది. ఇక వెంటనే ముకుందా తన మనసులో మురారి నేను ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫోటోలు ఎలాగైనా మురారికు చూపించాలి అని అనుకుంటుంది.

కాసేపటి తర్వాత మురారి కృష్ణ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ముకుందా మురారి కి ఆ ఫోటోలు చూపించాలని మురారి కోసం ఇల్లంతా వెతుకుతుంది కానీ, మురారి ఎక్కడా కనిపించడు. అయితే కృష్ణ దగ్గరే ఉండి ఉంటాడు ఈ ఫోటోలు చూపించి ఈ ఫోటోలో ఉన్న మురారిని అసలు రూపం ఇదే అని కృష్ణ చేత చెప్పించాలి అని ముకుందా అనుకుంటుంది. ముకుంద మురారికే కొన్ని ఫోటోలు ఇస్తుంది ఆ ఫోటోలు చూసిన తర్వాత ఈ ఫోటోలో నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు ముకుందా అని మురారి అడుగుతాడు అని అంటుంది. ముకుందా ఇక ఆ ఫోటోలు చూసిన తర్వాత ఎవరు కృష్ణ ఈ వ్యక్తి అని మురారి అడగగా మీరే సార్ అని కృష్ణ చెబుతుంది ఆ మాటకి మురారి గొంతు మూగపోతుంది. గతంలో ముకుందా తను ప్రేమించుకున్న కొన్ని సన్నివేశాలు మురారి కి గుర్తుకు వస్తాయి.






Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం