Skip to main content

Guppedanta Manasu November 29 2023 Episode

Click the Bell icon to update notifications on your mobile

Guppedanta Manasu November 29 2023 Episode

  • వసుధార రిషి తో చాలా థ్యాంక్స్ మీరు లేకపోయి ఉంటే నేను ఈరోజు జైల్లో ఉండేదాన్ని అంటూ రిషి చేతిని తన చేతిలోకి తీసుకొని థాంక్స్ చెప్తుంది వసుధార.రిషి ఏంటి వసుధార నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ఏలా ఊరుకుంటాను అనుకున్నావు నీ దగ్గరికి వచ్చే ప్రతి కష్టం నన్ను దాటి రావాలి నిన్ను ఎవరైనా టచ్ చేయాలంటే ఫస్ట్ నన్ను టచ్ చేసి తర్వాత నీ దగ్గరికి రావాలి నిన్ను అవమానించడానికి అయినా అనుమానించడానికి ఎవరైనా వస్తే అది నన్ను దాటుకుని రావాలి నేనుండగా నిన్ను అన్ని అవమానాల పాలు కష్టాలపాలు ఎలా చేస్తాను అనుకున్నావు వసుధార అంటాడు రిషి.
  • వసుధార ఏమో తెలియదు సార్ నాకు కాలేజీలో జరిగిన గొడవ చూసి భయం వేసింది చిత్ర నావల్లే సూసైడ్ ప్లాన్ చేశాను అని రాసిన లెటర్ చూశాక నాకు ఒక్కసారిగా చెప్పలేనంత భయం వేసింది అలాగే చెప్పలేనంత బాధ కూడా కలిగింది. నేను ఒక ఆడదాన్ని కదా సార్ నా వల్ల ఒక ఆడపిల్ల ఇన్ని బాధలు పడుతోంది అని తెలిసి కూడా నేను భయపడకుండా బాధపడకుండా ఎలా ఉంటానో సర్అది కూడా మొత్తం నా వల్లే జరిగింది అన్ని కాలేజీలో విలేకరుల ముందు మేడమ్స్ మాట్లాడుతుంటే నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి నాది మేడం పిల్లల ప్రాణాల కంటే మీ కాలేజ్ పరువు ప్రతిష్టలే ముఖ్యమా అంటూ వాళ్ళు నిలదీసిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి సార్ కానీ నేను చెప్పిన సమాధానం ఏది వాళ్లు నమ్మరు అని నాకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో నేను సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఒకటే కదా సార్ అందుకే ఏమీ మాట్లాడలేని పరిస్థితి నాది ఏం చేయాలో తెలియని భయం అలాంటి సమయంలో నేను వస్తాను వస్తారా నేనున్నాను అంటూ మీరు చెప్పిన మాటలకే నాకు ధైర్యం వచ్చింది సార్ అంటూ రిషికి మళ్ళీ థాంక్స్ చెప్తుంది వసుధారా.

  • మరోవైపు మహేంద్ర అనుపమ కు ఫోన్ చేసి ఎక్కడున్నవ్ అనుపమ ఒకసారి త్వరగా ఇంటికి రా అంటాడు. అనుపమ ఎందుకు మహేంద్ర అంటుంది.మహేంద్ర ఏమీ లేదు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు అంటాడు.
  • వసుధారా రిషి ఇంటికి వెళుతుంటారు.వసుధార సార్ నాకు తెలిసి ఆ ఎమ్మెస్సార్ కి ఇన్ని తెలివితేటలు లేవు కానీ దీని వెనక ఇంకెవరో ఉన్నారు అని నా అనుమానం ఉంటుంది.రిషి అంతేనంటావా వసుధార సరే చూద్దాం ఆ ఎమ్మెస్సార్ ని పట్టుకుంటే అసలు నిజం అంత బయటకు వస్తుంది అంటాడు రిషి.వసుధార సార్ కారు కొంచెం పక్కకు ఆపండి టీ కొట్టు వచ్చింది అంటుంది.రిషి ఏంటి వసుధార ఇప్పుడు టీ తాగుతావా అంటాడు. వసుధార అవును సార్ ఇద్దరం కలిసి తాగుదాం అంటూ టీ కొట్టు దగ్గరికి తీసుకు వెళుతుంది.రిషి ఆ భయ్యా రెండు టీ ఇవ్వండి అంటాడు.

  • వసుధార ఆ భయ్యా అందులో ముందుగా వాటర్ పోసి యాలకుల పొడి టీ పొడి వేసి బాగా మరిగాక పాలు వేయండి అప్పుడు టీ అదిరిపోతుంది అని చెబుతుంది.టీ కొట్టు బాబు అలాగేనండి అంటాడు.

  • రిషి వసుధ రా నువ్వేమైనా ఇంకా చిన్న పిల్లవా కాలేజ్ కి వెళ్లే స్టూడెంట్ లాగా మాట్లాడుతున్నావ్ అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నావు టీ వాడు పెడతాడు కదా వాడికి నేర్పిస్తున్నావా నువ్వు అలా చెబుతుంటే మన పక్కన ఉన్న వాళ్లంతా మనల్ని చూస్తున్నారు అంటాడు రిషి.వసుధార చూడనివ్వండి సార్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు బిర్యానీ నాకు కొంచెం స్పైసీగా ఉండాలి కొంచెం హాట్ గా ఉండాలి అని అడుగుతాం కదా అలాగే బర్గర్ షాప్ కి వెళ్ళినప్పుడు కొంచెం చీస్ ఎక్కువ ఉండాలి అని అడుగుతూ ఉంటాం కదా సర్ అలాగే ఇది మనకు టీ ఏ స్టైల్ లో కావాలో చెబితే వాళ్ళు ఇస్తారు కదా ఇందులో తప్పేముంది అంటుంది వసుధార
  • రిషి చాల్లే వసుధారా ఇక ఆపు అంటాడువసుధార దీనికే ఇలా అయితే ఇప్పుడు నేను వెళ్లి పెట్టి తీసుకొస్తే ఇంకెలా షాక్ అవుతారు అంటుంది వసుధార.రిషి ఏంటి వసుధార చిన్న పిల్ల లాగా ఏమీ అవసరం లేదు వాడే ఇస్తాడు కూర్చో అంటాడు.వసుధార ఏమి పర్వాలేదు సార్ నాకు ఇప్పుడు నా చేత్తో టీ పెట్టుకుని తాగాలని ఉంది ఇప్పుడే అయిదు నిమిషాల్లో నేను వేడివేడి టీ తీసుకొని వస్తాను మీరు కూర్చోండి అంటూ వెళ్లి టీ కొట్టు అతన్ని పక్కకు జరుగుమని వసుధార టీ పెట్టి తీసుకువచ్చి రిషికి ఇస్తుంది అలాగే టీ కొట్టతన్ని కూడా తాగుమని అంటుంది.
  • టీ కొట్టు తను తాగి వావ్ మేడం టి అదిరిపోయింది అని చెబుతాడు.
  • వసుధార ఇక మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి నచ్చలేదంటే మీలాగా చేసుకోండి అంటుంది.టీ కొట్టు అతను రిషి ని చూసి మీరు డి బి ఎస్ టి కాలేజ్ ఓనర్ మీరే కదా సార్ మీ గురించి నాకు బాగా తెలుసు మీరు చాలా మంచివారు అని విన్నాను మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలని ఉంది అంటాడు.వసుధార సెల్ఫీ ఏనా లేకుంటే ఈ సెల్ఫీతో పెద్ద బ్యానర్ కట్టి టీ కొట్టు ముందు పెడతావా అంటుంది.టీ కొట్టు తను వావ్ భలే ఐడియా ఇచ్చారు మేడం మీరు తప్పకుండా ఆ పని చేస్తాను నాకు టీవీ గిరాకి బాగా పెరుగుతుంది అంటాడు.రిషి చి చి అలాంటి పనులేం చేయకు నీ టీ రుచి తెలుసుకొని అందరూ నీ దగ్గరికి రావాలి తప్ప గొప్ప వాళ్ళ ప్రతిఫలాల్లో ఫోటోలు చూసి వచ్చి టీ తాగితే అది నీకూ ఎలా ఉంటుంది అయినా నీ సంపాదన ఎలా అవుతుంది? నువ్వు వాళ్ళని చీట్ చేసిన వాడివి అవుతావు

  • రిషి నువ్వు సొంతంగా పేరు తెచ్చుకోవాలి అంటాడు టీ కొట్టు అతనితో.అనుపమ మహేంద్ర ఇంటికి వస్తుంది.
  • మహేంద్ర టి తీసుకు వచ్చి అనుపమ కి ఇస్తాడు మహేంద్ర చూసావా అనుపమ నా కోడలు ఎలాంటి తప్పు చేయలేదు అంటే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు చూసావా అసలు నేరస్తులు దొరికారు వసుధార నిర్దోషి అని తేలింది అంటాడు.ఇంతలో రిషి వసుధారా ఇంటికి వస్తారు అనుపమను చూసిన రిషి వచ్చారా మేడం మీకు కాల్ చేద్దామని అనుకుంటున్నాను అంటాడు.అనుపమ ఎందుకు రిషి అని అడుగుతుంది.రిషి ఏమీ లేదు మేడం మీరు ఇచ్చిన క్లూ తోనే కదా నేను వసుధార ను నిర్దోషిగా నిరూపించాను అంటాడు.మహేంద్ర అవునా అనుపమ నువ్వు సహాయం చేయడం వల్లనే మేము వసుధార ను కాపాడుకో గలిగాము అంటాడు.అనుపమ ఏంటి మహేంద్ర చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అడుగుతుంది.

  • రిషి అవును మేడం చాలా సంతోషంగా ఉన్నాం అంటాడుఅనుపమ వసుధార కేసులో తీసుకున్న అంతటి చొరవ మరి మీ అమ్మ కేసులు ఎందుకు తీసుకోవట్లేదు జగతి విషయంలో ఎందుకు వెనుకబడుతున్నావు అంటుంది అనుపమ.రిషి అలా ఏం లేదు మేడం ఏదైనా నువ్వు దొరకాలని చూస్తున్నాను అంటాడు.అనుపమ క్లూ దొరికే దాకా అలాగే ఉంటావ రిషి ఏదైనా ట్రై చేస్తేనే కదా ఏదైనా దొరుకుతుంది అంటుంది అనుపమ.రిషి అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం నేను అమ్మ కేసు ఏమీ పట్టించుకోవడంలేదనే కదా మీ ఉద్దేశం అంటాడు.అనుపమ అది కాదు రిషి వసుధార విషయంలో ఏక్లూ దొరికిందని నువ్వు కేసు అంతలా రీసెట్ చేశావు అంటుంది.రిషి మీరు సపోర్ట్ గా ఉన్నారు కదా అందుకని నాకు త్వరగా క్లూ దొరికింది అంటాడు.అనుపమ ఇది ఏంటి మహేంద్ర మీకు ఎవరికి బాధ్యత లేనట్టు ప్రవర్తిస్తున్నారు జగతి బ్రతికినంత కాలం తనను కష్టాలు పెడుతూనే ఉన్నారు చనిపోయిన తర్వాత నైనా తనను చంపిన వాళ్ళు ఎవరు పట్టుకొని వారికి శిక్ష పడేలా చేస్తే జగతి చావు కన్నా న్యాయం జరుగుతుంది క్లూ దొరకడం లేదంటూ కూర్చుంటే ఏది దొరుకుతుంది అంటుంది అనుపమ.రిషి మేడం మేము బయటికి ఏడుస్తూ కనిపిస్తేనే మేము బాధపడుతున్నట్టు కనిపిస్తుందా లేకుంటే కనిపించేదా నేను ఎంత బాధ పడుతున్నాను మీకేం తెలుసు అమ్మ కేసు గురించి నేను ఎంతో ట్రై చేస్తున్నాను మొన్నటి దాకా నాన్న తాగుడుకు బానిస అయ్యారు. అది అలా ఉండగానే ఇప్పుడు వసుధారా కేసు ప్రాబ్లం ఇవన్నీ మాకు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంది కదా ఇక మేము ఏం చేసేది చెప్పండి అంటూ వెళ్ళిపోతాడు రిషి.


Comments

Popular posts from this blog

Trinayani today episode..తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?..

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES Trinayani today episode.... తిలోత్తమ వేసిన ప్లాన్ ఫలించి గాయత్రి జాడ తెలుస్తుందా?.. కడుపు నొప్పికి కారణాన్ని ముందుగా గుర్తించమని విక్రాంత్ సలహా ఇస్తాడు. ఎందుకు రాకూడదో సుమన సూచించింది. పెద్ద బొట్టమ్మలో అన్నం పెట్టడం వల్లే సుమనకు కడుపునొప్పి వచ్చిందని దమ్మక్క పేర్కొంది.   అన్నం ఆకలి తీరుస్తే కడుపునొప్పి ఎందుకు వస్తుందని పవనమూర్తి ప్రశ్నించారు. బొట్టమ్మకి హాని కలిగించడానికి ఎవరైనా అన్నంలో ఏదైనా పెట్టడానికి ప్రయత్నించారా అని విక్రాంత్ అడిగాడు. కొడుకు అన్నంలో విషం పెట్టాడని దమ్మక్క నిర్ధారించింది. విక్రాంత్ సుమనను తిట్టాడు మరియు ఆమె అలాంటి అహేతుక చర్యలకు ఎందుకు పాల్పడుతుందని ప్రశ్నించాడు.  దాని గురించి స్వామీజీని అడగాలని వల్లభ సూచిస్తున్నాడు. తిలోత్తమ అంగీకరించి ఇక మాట్లాడనని చెప్పింది.   స్వామీజీ మీ సూచనలను పాటిస్తే విశాలాక్షి కళ్లు మూసుకుని హాయిగా నిద్రపోయేదని, అయితే ఆమె నిజం చెప్పలేదని వల్లభ పేర్కొన్నారు.  అలా జరగకుండా ఉండేందుకు నాగయ్యను కట్టడి చేశారని స్వామి వివరిస్తాడు. తిలోత్తమ అంగీకరించలేదు మరియు గురువు వచ్చి గాయత్రి సోదరి ఆ

Prema Entha Madhuram December18 2023 Episode

                                      Prema Entha Madhuram December18 2023 Episode                                                 Bookmark this site to instant open                                                      VISIT FOR DAILY UPDATES image credits to zee tv  ఆర్య మీటింగ్ అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు అక్కడే రిసెప్షన్ దగ్గర దివ్య హరీష్ ఉంటారు ఆర్య అలా వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ చూస్తారు... ఆర్య కూడా వాళ్ళను చూసి ఒక్క నిమిషం ఆగి రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయిని చూసి మేడం ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను ఆయన ఆలోచించుకొని చెప్తాను అన్నారు అని మాట్లాడినట్టు మాట్లాడి నువ్వు ఎక్కువగా ఆశ్చర్యపోయి నను సార్ అని పిలువకు కూర్చో అని అంటాడు ఆర్య...  ఓకే సార్ అని అమ్మాయి కూర్చుండు పోతుంది.  ఇంతలో దివ్య హరీష్ అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు... ఇక్కడ క్యాటరింగ్ కోసం మేనేజర్ గారితో మాట్లాడదామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని ఆర్య అంటాడు.  నీలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాటరింగ్ ఇవ్వడానికి ఇదేమైనా చిన్న చిన్న హోటల్స్ అనుకున్నావా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీ ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడానికే నెలలు పడుతుంద

prema entha maduhuram today episode

Bookmark this site to instant open VISIT FOR DAILY UPDATES ఆర్య ని చూసి ప్రాణభయంతో వణికిపోతున్న జలంధర్. image cutesy by hotstar అప్పుడంటే మనకు తోడుగా ఎవరూ లేరు కాబట్టి అమ్మ మనల్ని కూడా గుడికి తీసుకు వెళ్ళేది అక్కి ఇప్పుడు నాయనమ్మ వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కదా అందుకే అమ్మ ఒక్కతే వెళ్ళింది అమ్మ వచ్చేసరికి మనం టిఫిన్ చేయకపోతే బాధపడుతుంది తిను అక్కీ  అని అభయ్  టిఫిన్ తినిపిస్తాడు.  అన్నయ్య నువ్వు కూడా తిను అని అక్కి అభయ్ కి తినిపిస్తుంది. ఉష రాధా చాలా అదృష్టవంతురాలు ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు నాకేమీ అర్థం కావట్లేదు అని సుగుణ ఏడుస్తుంది...  ఊరుకో అమ్మ తనకి ఏ ప్రాబ్లం ఉందో అని ఉష అంటుంది. ఇంత చిన్న వయసులోనే అభాయ్ కి ఉన్న ఆలోచన చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా చూడు వాళ్ళ చెల్లికి ఎంత చక్కగా మాటలు చెప్పి టిఫిన్ తినిపిస్తున్నాడు అని సుగుణ అంటుంది...మరోవైపు   , ఆర్య అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు... జెండి ఈ పని  చేసింది ఎవరో తెలిసిందా అని ఆర్య అంటాడు. తెలిసింది ఆర్య ఇంకెవరు ఆ జలంధరే ఇలా ప్లాన్ చేశాడు అని జెండి చెప్తాడు.వాడికి ఎన్నిసార్లు వార్నిం